భారత్ లో క్రికెట్, సినిమా రెండు మతాలు. క్రికెటర్లన్నా, సినిమా స్టార్లన్నా జనం పడిచస్తుంటారు. వారు స్క్రీన్ మీద కనిపిస్తేచాలు పూనకంతో ఊగిపోతారు.
2/ 6
అలాంటిది క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే ఆ కిక్కేవేరు. తాజాగా చెన్నైలో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
3/ 6
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకేచోట కలిశారు. అందుకు చెన్నైలోని గోకుల్ స్టూడియో వేదికైంది.
4/ 6
సెప్టెంబర్ 10వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సీఎస్కే సారధి ఎంఎస్ ధోనీ ఇటీవలే చెన్నై వెళ్లాడు.
5/ 6
కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం స్టూడియో కు వెళ్లిన ఎంఎస్ ధోని.., పక్కనే ఇళయ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు.
6/ 6
కాసేపు హీరో విజయ్ తో ఎంఎస్ ధోనీ ముచ్చటించాడు. ఇద్దరూ కలిసి సినిమాలతో పాటు క్రికెట్ కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.