ఇంగ్లాండ్-ఇండియా టెస్ట్ మ్యాచ్లలో హల్ చల్ చేస్తున్న జెర్సీ నెంబర్ 69 జర్వో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. రెండో టెస్టులో టీమ్ ఇండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్ సెట్ చేసిన జర్వో.. ఈ సారి సెక్యూరిటీ కళ్లుగప్పి ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్కు వచ్చాడు. రోహిత్ శర్మ అవుటైన వెంటనే వికెట్ల దాకా వెళ్లిన జర్వోను సెక్యూరిటీ బలవంతంగా అక్కడి నుంచి పంపించేసింది. టీమ్ ఇండియా 12వ ఆటగాడు.. ఇండియాను ఓటమి నుంచి కాపాడటానికి వచ్చాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే జర్వో మామపై మీమ్స్ చేసి ఫేస్బుక్లో వదిలారు. మీరూ చూడండి ఆ మీమ్స్... (PC: Twitter)