తెలుగు వారియర్స్ కెప్టెన్ అయిన అక్కినేని అఖిల్ 32 బంతుల్లో 67 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో.. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా CCLలో తెలుగు వారియర్స్ నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్‌గా రికార్డ్ సృష్టించింది.
మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్‌పురి టీమ్... 6 వికెట్ల నష్టానికి 89 రన్స్ చేసింది. ఫలితంగా 58 రన్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తెలుగు వారియర్స్.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అఖిల్ నిలిచాడు.