సానియా మీర్జా నియామకంపై ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీని తీసుకుంది. మహిళా క్రికెటర్లలోనే అత్యంత బ్యూటీఫుల్ ప్లేయర్లు అయిన స్మృతి మంధాన, ఎల్లిస్ పెర్రీలు ఆర్సీబీలోనే ఉండటం.. తాజాగా టెన్నిస్ బ్యూటీ జట్టుతో చేరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సానియా మీర్జాను మెంటార్‌గా నియమించుకోవడంతో ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.