క్వార్టర్ ఫైనల్లో సానియా –మాడిసన్ కీస్ జంట 7–5, 3–6, 10–6తో యులియా–సోఫియా కెనిన్ పై పోరాడి గెలిచింది. తొలి సెట్ లో విజయం సాధించి.. రెండో సెట్ లో ఓడటంతో మ్యాచ్ సూపర్ టై బ్రేక్ కు దారితీసింది. అయితే ఇక్కడు అద్భుత ఆటతీరు కనబరిచిన సానియా జంట ప్రత్యర్థిని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. (PC : TWITTER)
ఈ మ్యాచ్ లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం 5–7, 5–7తో వరల్డ్ నంబర్ త్రీ కోకో గాఫ్–జెస్సికా పెగూలా (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా –కీస్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–కీస్ జోడీకి 39,680 డాలర్ల (రూ. 31 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. (PC : TWITTER)