మరోవైపు మహిళల సింగిల్స్ లో జపాన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ఫైనల్స్ లో భాగంగా ఇక్కడి కరోలినా మారిన్ స్టేడియంలో జరిగిన పోరులో ఆమె చైనీస్ తైఫీకి చెందిన క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ తైజు యింగ్ తో జరిగిన పోరులో ఘన విజయం సాధించింది. ఆఖరి పోరులో ఆమె 21-14, 21-11 తో వరుస సెట్లలో తైజు యింగ్ పై గెలిచింది. (AP Photo)
ఇక, ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా తుది పోరులో ఓడినా శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ కు చేరడమే గాక రజత పతకం నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన మూడో ఆటగాడు శ్రీకాంతే. ఈ ప్లేయర్ జిల్లాకు చెందిన వాడు. (AP Photo)
పురుషుల సింగిల్స్ ఫైనల్లో సింగపూర్ కు చెందిన ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు లో కిన్ యె తో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. 42 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో లో కిన్ యె.. 21-15, 22-20 తో శ్రీకాంత్ ను ఓడించాడు. శ్రీకాంత్.. రెండో స్థానంతో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఇది కియాన్ లో తొలి టైటిల్. ఇక, భారత్ కే చెందిన లక్ష్య సేన్ కు కాంస్య పతకం దక్కింది. అలాగే, డెన్మార్క్ కు చెందిన అండర్స్ అంటోసన్ కు కూడా కాంస్యం దక్కింది. (AP Photo)