Jasprit Bumrah : ‘బుమ్రా ఒక బేబీ బౌలర్.. నేనైతే ఉతికి ఆరేసేవాడిని’ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్
Jasprit Bumrah : ‘బుమ్రా ఒక బేబీ బౌలర్.. నేనైతే ఉతికి ఆరేసేవాడిని’ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్
Jasprit Bumrah : ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. మ్యాచ్ ఫిట్ నెస్ సాధించేందుకు మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తాజాగా బుమ్రాపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) 2022 నుంచి క్రికెట్ కు దూరమయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో టి20లో ఆడిన అతడు అనంతరం మరోసారి గాయం బారిన పడ్డాడు.
2/ 8
జనవరి 18న న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్లకు అతను దాదాపుగా దూరమవుతాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేకు వేదికైన గౌహతికి భారత జట్టుతో కలిసి బుమ్రా వెళ్లలేదు.
3/ 8
అక్కడి లోకల్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా ఒక బేబీ బౌలర్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి బుమ్రా ఏ మాత్రం పోటీ కాదని పేర్కొన్నాడు. అఫ్రిది దరిదాపుల్లో కూడా బుమ్రా లేడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
4/ 8
అంతేకాకుండా తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడు. తాను గ్లెన్ మెక్ గ్రాత్, వసీం అక్రమ్ లాంటి మేటి పేసర్లతో కలిసి క్రికెట్ ఆడానని పేర్కొన్నాడు. అటువంటి వారిని ఎదుర్కొన్న తాను బుమ్రాను తేలికగా ఆడేవాడిని గొప్పలు చెప్పుకున్నాడు.
5/ 8
బుమ్రా తన ముందు బేబీ బౌలర్ అంటూ చెత్త వాగుడు వాగాడు. అయితే దీనికి భారత అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. భారత ప్లేయర్ల గురించి తలుచుకోకుండా పాకిస్తాన్ క్రికెటర్లు ఒక్కరోజు కూడా ఉండలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
6/ 8
పాపులారిటీ కోసం భారత ప్లేయర్లపై విమర్శలు చేయడం పాకిస్తాన్ మాజీలకు అలవాటైన పనేనని అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
7/ 8
భారత ప్లేయర్లపై నోరు పారేసుకోవడం అబ్దుల్ రజాక్ కు ఇదేం కొత్త కాదు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ పై కూడా అబ్దుల్ రజాక్ గతంలో విమర్శలు చేశాడు. అయితే ఇర్ఫాన్ తన ఆటతో రజాక్ కు బదులిచ్చాడు.
8/ 8
2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ నడ్డి విరిచాడు ఇర్ఫాన్ పఠాన్. ఆ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఆ రకంగా రజాక్ నోటికి ఇర్ఫాన్ పఠాన్ తాళం వేశాడు.