ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లకు పేస్ ట్రాక్, ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లకు సీమ్ ట్రాక్.. భారత్‌లో మ్యాచ్‌లకు స్పిన్ ట్రాక్ ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం ఇండియా విషయంలోనే అభ్యంతరం వ్యక్తమవుతుంది. స్పిన్ ఆడటంలో వీక్ అయిన ఆస్ట్రేలియా తమ బలహీనతను బయటకు చెప్పకుండా పిచ్‌పై ఏడవడం కామన్‌గా మారిపోయింది. Image source Twitter/SEN_Cricket
ఈ విషయంపై సోషల్‌మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. టర్నర్లను తయారు చేయడానికి ఇండియా పిచ్‌ను తారుమారు చేస్తోందని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ వాదనను భారత క్రికెట్ వర్గాలు తీవ్రంగా విమర్శించాయి. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు. Image source Twitter/OneCricketApp
రోహిత్ శర్మ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. పిచ్ కంటే క్రికెట్ పై దృష్టి పెట్టాలని కోరాడు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని సచిన్.. ఈ సారి మాత్రం రియాక్ట్ అయ్యాడు. Image source Twitter/circleofcricket
అంతర్జాతీయ క్రికెటర్ అయ్యాక ప్రపంచంలో ఏ గ్రౌండ్‌లోనైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడాలంటూ సచిన్ ఆసీస్‌కు చురకలంటించారు. ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ టర్నర్లను మేం ఆశించలేదని..అక్కడ కొద్దిగా బౌన్సీ, సీమ్, పేస్ పిచ్‌లు ఉంటాయన్ని మైండ్‌లో ప్రిపేర్ అయ్యే వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఈ విషయం వాళ్లకి తెలియనది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆసీస్ భారత్‌లో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తాను భావిస్తున్నానంటూ తనలోని హుందాతనాన్ని బయటపెట్టుకున్నాడు సచిన్. Image source India TV news