తనదైన రోజున ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌తో జడేజా మ్యాచ్ గతినే మార్చేయగలడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత జడేజా సౌరాష్ట్ర తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఫామ్‌లో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది.
* డేవిడ్ వార్నర్ : లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్లకు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం సులభం. కానీ రవీంద్ర జడేజా కేవలం 89 బంతుల్లో నాలుగు సార్లు డేవిడ్ వార్నర్ వికెట్ సాధించాడు. వార్నర్‌ను 2013 సిరీస్‌లో రెండుసార్లు, 2017 సిరీస్‌లో రెండుసార్లు జడేజా ఔట్ చేశాడు. వాస్తవానికి జడేజాపై వన్డేలలో వార్నర్‌కు మెరుగైన రికార్డు ఉంది. ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో జడేజాను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.