ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డుల వేట కొనసాగుతోంది. కొంతకాలం పరుగులు సాధించడంలో ఇబ్బంది పడిన కోహ్లి.. ఫాం అందుకున్నాడు. కొన్ని రోజుల్లోనే ఇండియాలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మొదలుకానుంది. కొంత కాలంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయి.
* ఆసీస్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఇండియన్ ప్లేయర్ : కోహ్లి చివరిసారిగా 2018లో పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశాడు. అప్పటి నుంచి టెస్ట్‌లలో ఆసీస్‌పై సెంచరీ చేయలేదు. ఈ సిరీస్‌లో కోహ్లి సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. కోహ్లి ఈ సిరీస్‌లో కనీసం రెండు సెంచరీలు చేస్తే, లెజెండరీ సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమిస్తాడు.