టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ (Leander Paes)తో నటి కిమ్ శర్మ(Kim sharma) గత కొద్ది కాలంగా డేటింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా ఈ ఇద్దరు బాహాటంగానే తిరుగుతున్నారు. గతంలో గోవాలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోస్ వైరల్ కావడంతో కిమ్, పేస్ డేటింగ్ విషయం బయటకొచ్చింది. (kimsharmaofficial/instagram)
ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న కిమ్ శర్మ, ఆ తర్వాత కెన్యా బిజినెస్‌మ్యాన్ అలీ పుంజానీని పెళ్లాడింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కిమ్శర్మను ఆర్థికంగా కూడా వాడుకున్న అలీ పుంజనీ, ఆమెను అన్నివిధాలుగా దెబ్బతీశాడు. దీంతో 2016లో అతనితో విడాకులు తీసుకుంది కిమ్ శర్మ. (kimsharmaofficial/instagram)
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన చివరి భారత టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్న లియాండర్ పేస్, ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. ‘పర్దేశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ హీరోయిన్ మహీమా చౌదరితో 2000 నుంచి 2003 దాకా డేటింగ్ నడిపించాడు లియాండర్ పేస్. అయితే వీరి బంధం మూడేళ్లలోనే వీగిపోయింది. (kimsharmaofficial/instagram)