భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా క్రికెటర్లతోనే ప్రేమలో పడ్డ వాళ్లు ఉన్నారు. (Image Credit : Facebook)
ఇక, టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Latest Telugu News) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ కోహ్లీని ఎంతో అభిమానిస్తుంటారు. కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా కోహ్లీతో ప్రేమలో పడ్డ వాళ్లు ఉన్నారు. (Image Credit : Facebook)
జెర్సీ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాళ్ ఠాకూర్.. తాను ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు చెప్పింది. 'ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిపిచ్చిగా ప్రేమించా. నా సోదరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలా నేను కూడా క్రికెట్ చూడటం మొదలెట్టా. (Image Credit : Facebook)
ఆ తర్వాత ఆటను ఇష్టపడడం మొదలుపెట్టి.. ఆ క్రమంలో కోహ్లీ ఆట చూసి ప్రేమలో పడిపోయా. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశా. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నీలిరంగు జెర్సీ ధరించి టీమిండియా తరపున చీర్స్ చేశా. ప్రస్తుతం జెర్సీ లాంటి క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని మృణాళ్ పేర్కొంది. (Image Credit : Facebook)
ఇక, విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్అనుష్క శర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఓ షాంఫూ యాడ్ షూటింగ్లో ఇద్దరు తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. (Image Credit : Facebook)
గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు దూరమైంది. అనుష్క చివరి సారిగా 2018లో 'జీరో' సినిమాలో నటించింది. ఇటీవల నిర్మాతగా మారిన అనుష్క.. పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి ఓటీటీలో విడుదల చేస్తోంది. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'ఖాలా' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. (Image Credit : Facebook)