టీమిండియా నయా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలో.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్ (New Zealand)ను చిత్తు చేసింది. దాంతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
లేటెస్ట్ గా.. రవిశాస్త్రి కోచింగ్‌పై అభిప్రాయం కోరగా గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవరూ కూడా గొప్పలు చెప్పుకోవద్దని, మన గురించి ఇతరులు మాట్లాడుకోవాలన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా తాము ఎవ్వరం అత్యుత్తమ జట్టుగా చెప్పుకోలేదని గుర్తు చేశాడు. అలాగే, ప్రస్తుత కోచ్ రవిశాస్త్రిలా బడాయికి పోడని కామెంట్ చేశాడు.