Team India : ఇంగ్లండ్ తో టెస్టుకు ముందు భారత్ కు భారీ షాక్.. కరోనాతో స్టార్ ప్లేయర్ దూరం.!
Team India : ఇంగ్లండ్ తో టెస్టుకు ముందు భారత్ కు భారీ షాక్.. కరోనాతో స్టార్ ప్లేయర్ దూరం.!
IND vs ENG : దాంతో చివరి టెస్టులో తాము ఆడలేమని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కు బీసీసీఐ (BCCI) తెలిపిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరు దేశాల బోర్డులు చర్చించి ఆగిపోయిన ఐదో టెస్టును ఈ ఏడాది జరిపేలా నిర్ణయించుకున్నాయి.
గతేడాది ఇంగ్లండ్ (England)తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివరి టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ ఆటగాళ్లలో పలువురికి కరోనా సోకింది.
2/ 6
దాంతో చివరి టెస్టులో తాము ఆడలేమని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కు బీసీసీఐ (BCCI) తెలిపిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరు దేశాల బోర్డులు చర్చించి ఆగిపోయిన ఐదో టెస్టును ఈ ఏడాది జరిపేలా నిర్ణయించుకున్నాయి.
3/ 6
ఇదిలా ఉంటే ఈ టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా వల్ల ఇంగ్లండ్ తో జరిగే చివరి రీషెడ్యూల్ టెస్టుకు దూరమయ్యే చాన్స్ కనిపిస్తోంది.
4/ 6
కరోనా సోకడంతో అతడు ఇప్పటి వరకు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే అతడు కోలుకుని తొలి టెస్టు ఆరంభం అయ్యేనాటికి జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.
5/ 6
తొలి టెస్టు ఆరంభం కావడానికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో టెస్టు మ్యాచ్ లో అశ్విన్ ఆడేది అనుమానమే. ఇక సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా ఉన్న పంత్, శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్ కు బయలుదేరారు. వీరు మిగిలిన జట్టుతో కలుస్తారు.
6/ 6
Team ఇక ఐర్లాండ్ తో జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన మరో టీమిండియా జట్టు కూడా ఇంగ్లండ్ కు బయలుదేరింది. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించునున్నాడు.