విండీస్ మీద వన్డే సిరీస్ తో ధనాధన్ సిరీస్ టీమిండియా (Team India) నెగ్గడంతో ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ (BCCI). టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బయో బబుల్‌ను వీడనున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో విరాట్ కోల్‌కతా నుంచి ముంబై బయలుదేరనున్నాడు.
మూడో మ్యాచుకు ముందే కోహ్లి.. జట్టును వీడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారి కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు. " అవును.. భారత్ ఇప్పటికే సిరీస్ నెగ్గిన నేపథ్యంలో కోహ్లి శనివారం బయో బబుల్ ను వీడనున్నాడు. బీసీసీఐ ఇదివరకే నిర్ణయించినట్టు.. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు బబుల్ నుంచి విరామం ఇవ్వనున్నాం. తీరిక లేని క్రికెట్ వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలను ఎదుర్కుంటున్నారు. " అని తెలిపాడు.