MS Dhoni : ఐపీఎల్ ఆరంభానికి ముందే ధోనీ టీంకు బిగ్ షాక్! గాయంతో 7 అడుగుల ప్లేయర్ ఆడేది అనుమానమే
MS Dhoni : ఐపీఎల్ ఆరంభానికి ముందే ధోనీ టీంకు బిగ్ షాక్! గాయంతో 7 అడుగుల ప్లేయర్ ఆడేది అనుమానమే
MS Dhoni : నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) చాంపియన్ గా నిలిచింది. మరో ఐదు సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్ గా నిలిచింది. ధోని సారథ్యంలో ఐపీఎల్ లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైకు పేరుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అత్యంత నిలకడైన జట్టు. రెండు సార్లు మినహా.. ఆడిన ప్రతిసారి కనీసం సెమీఫైనల్ కు చేరుకుంటూ వస్తోంది.
2/ 8
నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) చాంపియన్ గా నిలిచింది. మరో ఐదు సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్ గా నిలిచింది. ధోని సారథ్యంలో ఐపీఎల్ లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నైకు పేరుంది.
3/ 8
అయితే గత సీజన్ లో చెన్నై లెక్క తప్పింది. కెప్టెన్సీ మార్పులతో పాటు పేలవ ప్రదర్శన ఆ జట్టును పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచేలా చేశాయి. అయితే ఈ ఏడాది అదరగొట్టాలనే ఉద్దేశంలో ఉంది.
4/ 8
మినీ వేలంలో ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్ ను దక్కించుకుంది. అయితే ధోని జట్టుకు సీజన్ ఆరంభానికి ముందే ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తుంది.
5/ 8
న్యూజిలాండ్ స్టార్ బౌలింగ్ ఆల్ రౌండర్ కైల్ జెమీసన్ వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సమాచారం దాంతో అతడు ఈ సీజన్ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
6/ 8
జెమీసన్ గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. దాదాపు 6 అడుగుల 8 అంగుళాలు ఉండే జెమీసన్ బంతితో బ్యాట్ తో మెరవగల సమర్థుడు. అతడిని వేలంలో రూ. కోటి రూపాయిలకు చెన్నై సొంతం చేసుకుంది. (PC : RCB)
7/ 8
ఇతడితో పాటు దీపక్ చహర్ గాయంపై కూడా సమాచారం లేదు. మొదట తొడ కండరాల గాయం.. ఆ తర్వాత వెన్నుగాయాలతో గత సీజన్ లో దీపక్ చహర్ ఆడలేదు. అనంతరం కోలుకుని టీమిండియా తరఫున కమ్ బ్యాక్ చేసినా.. అంతలోనే మళ్లీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
8/ 8
30 ఏళ్లు దాటిన ప్లేయర్లే చెన్నైలో ఎక్కువగా ఉన్నారు. ధోని, రహానే, స్టోక్స్, మొయినీ అలీ, అంబటి రాయుడు, జడేజా ఇలా అందరు మూడు పదుల వయసు దాటిన వాళ్లే. ఇక కెప్టెన్సీ విషయంలో ధోని వారసుడు ఎవరనే దానిపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది.