భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) తండ్రి అయ్యాడు. భువనేశ్వర్ భార్య నూపూర్ నగార్ (Nupur Nagar) ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం (నవంబర్ 24) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భువనేశ్వర్ కంటే ముందు.. విరాట్ కోహ్లీ, ఉమేష్ యాదవ్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఆడపిల్లలకే తండ్రి అయ్యారు. (PC: Instagram)