ఇండియా నుంచి జిమ్నాస్టిక్స్ విభాగంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రణతి నాయక్ అర్హత సాధించింది. తన జిమ్నాస్టిక్స్ స్కిల్స్ చూపించడానికి ఆమె పూర్తిగా సిద్దమవుతుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలోని ఐజీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నది. (sai)
2/ 6
ప్రణతి అనేక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమె కొన్నాళ్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేసింది. (SAI)
3/ 6
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఆల్‌రౌండ్ ఈవెంట్లో ప్రణతి నాయక్ పోటీ పడనున్నది. 26 ఏళ్ల ప్రణతి 2019 ఆసియా ఆర్టిస్టిక్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఆమె టోక్యో ఒలింపిక్స్ కోసం కాంటినెంటల్ కోటాను సాధించింది. (News 18)
4/ 6
ప్రణతి తండ్రి శ్రీమంత్ నాయక్ బస్సు డ్రైవర్ కాగా, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి ప్రణతి ఎక్కువగా దూకుతూ ఉండేదని.. ఆ తర్వాత తనలోని టాలెంట్ గమనించి జిమ్నాస్టిక్స్‌లో జాయిన్ చేసినట్లు తల్లి చెప్పింది. (News 18)
5/ 6
ప్రణతి తొలి సారిగా దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నది. ఆమెకు తోడుగా కోచ్ లఖన్ శర్మ కూడా టోక్యో వెళ్లనున్నాడు. పతకంపై ఆమె పెద్దగా ఆశలు పెట్టుకున్నది. (SAI)
6/ 6
టోక్యోలో జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడల్లో ఇండియా తరపున పాల్గొంటున్న ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి. 2019 ఆసియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నది. కరోనా కారణంగా అర్హత పోటీలు ఏమీ జరుగనందున.. ఆసియన్ చాంపియన్‌షిప్ ఆధారంగానే ఆమె ఒలింపిక్స్‌కు ఎంపికైంది. (SAI)