అయితే, ఈ మెగా టోర్నీ కన్నా ముందే న్యూజిలాండ్ టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. అది ఎలా అనుకుంటున్నారా..? ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కునెట్టిన న్యూజిలాండ్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడంతో కివీస్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది.
అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది. 1999లో స్టీఫెన్ ఫ్లెమింగ్ నాయకత్వంలోని న్యూజి లాండ్ బృందం ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.