ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో హార్దిక్ పాండ్యా (Hardik Pnadya) సారథ్యంలోని టైటాన్స్ (Gujarat Titans)దుమ్మురేపుతోంది. ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చినా తగ్గేదే లే అన్నట్టు అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేసులో నిలిచింది. ఇక, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా దుమ్మురేపుతున్నాడు. తనలోని టాలెంట్ అంతా బయటపెడుతూ చెలరేగుతున్నాడు. ఆల్ రౌండ్ షోతో మైమరిపిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్, రాహుల్ చహర్" width="1600" height="1600" /> ఈ ప్రదర్శనను బట్టి టీమిండియా (Team India)లోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ (T20 Worldcup 2022) ఉన్న నేపథ్యంలో పాండ్యా వంటి అనుభవజ్ఞుడైన స్టార్ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు కల్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉండడం టీ20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
హైదరాబాద్ షెడ్యూల్, సన్ రైజర్స్ హైదరాబాద్" width="1600" height="1600" /> దీంతో హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడ్డాడా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో కేవలం మూడు బంతులు మాత్రమే వేసిన హార్దిక్ పాండ్యా.. ఉన్నట్టుండి ఫీల్డ్‌ను విడిచి పెట్టాడు.