భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే..ఆలోచన ఎలా ఉంది. అవును..క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయ్. ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంటలు పెళ్లిపీటలెక్కగా… మరికొన్ని జంటలు మనస్ఫర్ధలతో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు.
కపిల్‌దేవ్, సారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలనూ మోసింది మీడియా. నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకెళ్లాడు కపిల్. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇంకేం.. ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా కుతూహలం రేగింది ఇరువురి అభిమానుల్లో. కానీ.. కపిల్ బ్రేక్ చేసుకున్నాడు ఆ బంధాన్ని. కారణం.. సారికకు అతనికి స్పర్థలు రావడం కాదు.
తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయాడు కపిల్. ఆమె చురుకుదనం అతన్ని కట్టిపడేసింది. ఆ ప్రేమ అలా సాగుతుండగా.. స్పర్థలు వచ్చాయి. దానికి కారణం.. సారికతో పరిచయం సన్నిహితంగా మెలిగేంత స్నేహంగా మారడమే అంటుంది హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం. అందువల్లే రోమీ మనసు నొచ్చుకొని సైలెంట్‌గా ..కపిల్‌కు దూరంగా ఉండిపోయిందనీ అంటారు కపిల్, రోమీ దోస్తులు కూడా. కాదు.. కపిల్ ప్రపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయింది.