క్రికెట్ పండగ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 16వ సీజన్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది.
ఈ సారి కూడా అందరి కళ్లు కార్తీక్ కాకపైనే ఉన్నాయి. అయితే.. ఐపీఎల్ కు ముందు ఈ స్టార్ ఫినిషర్ ఓ భారీ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఆ అనౌన్స్ మెంట్ తో ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక భారత ప్లేయర్ గా డీకే నిలిచాడు. ఇక ఈ అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు డీకే. మరి దినేష్ కార్తీక్ దక్కించుకున్న గౌరవం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
16 మ్యాచ్ ల్లో183 స్ట్రైక్ రేట్, 55 సగటుతో 330 పరుగులు.. ఈ లెక్కలు చాలు.. గతేడాది ఐపీఎల్ లో కార్తీక్ ఎలా రెచ్చిపోయాడో చెప్పడానికి. ప్రస్తుతం ఐపీఎల్ కోసం క్రికెటర్లంతా తమ తమ జట్లతో కలిసి ఇప్పటికే ప్రాక్టీస్ మెుదలు పెట్టారు. కాగా రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఫినిషర్ గా బరిలోకి దిగబోతున్నాడు దినేశ్ కార్తీక్. ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి కప్ అందించాలని ఆరాటపడుతున్నాడు.
ఇక, ఈ క్యాష్ రీచ్ లీగ్ కు ముందు బంపరాఫర్ కొట్టేశాడు దినేష్ కార్తీక్. ఈ ఐపీఎల్ అవ్వగానే కామెంట్రీ బాక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు డీకే. గతంలో టీ20 వరల్డ్ కప్ తర్వాత కామెంటేటర్ గా అవతారం ఎత్తాడు దినేశ్ కార్తీక్. తాజాగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా కామెంటేటర్ గా వ్యవహరించాడు డీకే. ఐపీఎల్, వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత వెంటనే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.
యాషెస్ సిరీస్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ కోసం స్కై క్రికెట్ ఛానల్ తరపున డీకే కామెంట్రీ బాక్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఇక భారత్ నుంచి దినేశ్ కార్తీక్ ఒక్కడే ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. దాంతో ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
దినేష్ కార్తీక్ తో పాటు ఇయాన్ మోర్గాన్, పీటర్సన్, పాంటింగ్, మార్క్ టేలర్, సంగక్కర, మెల్ జోన్స్, ఇయాన్ వార్డ్, అథెర్టన్, బౌచర్, నాసీర్ హుస్సేన్, అండ్రూ స్ట్రాస్ ప్రతిష్టాత్మక యాషెస్ కోసం కామెంటేటర్లు గా వ్యవహరించనున్నారు. లెజెండ్స్ మధ్య ఒకడిగా ఉండటం గర్వకారణంగా ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన స్కై క్రికెట్ కు ధన్యవాదాలు అంటూ ట్వీటర్ ద్వారా వెల్లడించాడు డీకే. (PC : Twitter)