Team India : ’నేను లేకపోతే గంగూలీకి కెప్టెన్సీ లేదు‘ సంచలన కామెంట్స్ చేసిన టర్బోనేటర్
Team India : ’నేను లేకపోతే గంగూలీకి కెప్టెన్సీ లేదు‘ సంచలన కామెంట్స్ చేసిన టర్బోనేటర్
Sourav Ganguly : ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. కెప్టెన్సీ తన వల్ల కాదంటూ సచిన్ లాంటి దిగ్గజం వెనక్కి తగ్గిన వేళ.. నేనున్నానంటూ గంగూలీ 2000వ సంవత్సరంలో ముళ్ల కిరీటాన్ని అందుకున్నాడు. అక్కడి నుంచి టీమిండియా క్రకెట్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు గంగూలీ.
సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar), సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాదిరి భారీ రికార్డులు సాధించకపోయినా.. కపిల్ దేవ్ (Kapil Dev), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)లా ప్రపంచకప్ లు అందించకపోయినా.. టీమిండియాపై సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తనదైన ముద్రను వేశాడు.
2/ 7
ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. కెప్టెన్సీ తన వల్ల కాదంటూ సచిన్ లాంటి దిగ్గజం వెనక్కి తగ్గిన వేళ.. నేనున్నానంటూ గంగూలీ 2000వ సంవత్సరంలో ముళ్ల కిరీటాన్ని అందుకున్నాడు. అక్కడి నుంచి టీమిండియా క్రకెట్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు గంగూలీ.
3/ 7
ఆస్ట్రేలియా ,ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యానికి గండి కొట్టేలా గంగూలీ టీమిండియాను ముందుండి నడిపించాడు. తన హయాంలోనే యువరాజ్ సింగ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి మ్యాచ్ విన్నర్లను టీమిండియాలోకి తీసుకొచ్చాడు.
4/ 7
తాజాగా టర్బోనేటర్ హర్భజన్ సింగ్ సౌరవ్ గంగూలీ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్భజన్ సింగ్.. తన ప్రతిభ వల్లే గంగూలీ తన కెప్టెన్సీని నిలబెట్టుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు.
5/ 7
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో గంగూలీ తనకు అవకాశం ఇవ్వకుండా ఉండి ఉంటే.. అతడు తన కెప్టెన్సీని కోల్పోయి ఉండేవాడంటూ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
6/ 7
2001లో జరిగిన ఆ సిరీస్ లో భారత్ తొలి టెస్టులో ఓడిపోయింది. అనంతరం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో హర్భజన్ సింగ్ అద్భుత ప్రదర్శన, వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్ ల సూపర్ బ్యాటింగ్ తో ఫాలో ఆన్ ఆడి మరీ భారత్ ఆ మ్యాచ్ లో గెలుస్తుంది.
7/ 7
ఇక జట్టులో ప్లేస్ కోసం ఎదురు చూస్తోన్న హర్భజన్ సింగ్ కు అవకాశం ఇచ్చిన గంగూలీ అతడి నుంచి అద్భుత ప్రదర్శనను రాబట్టాడు. అదే సమయంలో ఆసీస్ పై సిరీస్ గెలిచి తన కెప్టెన్సీని నిలబెట్టుకున్నాడు.