టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తాను కోహ్లీని పర్సనల్ రిక్వెస్ట్ చేశానని గంగూలీ (Sourav Ganguly) చెప్పాడు. వన్డే కెప్టెన్సీని మార్చేముందు కూడా విరాట్‌తో మాట్లాడానని చెప్పాడు. కానీ, టీ20 కెప్టెన్సీ పునరాలోచన చేయాలని తనను ఎవ్వరూ కోరలేదని, వన్డే కెప్టెన్సీ తొలగించే విషయంలో ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోహ్లీ (Virat Kohli) స్పష్టం చేశాడు.
మరోవైపు సౌతాఫ్రికాతో వన్డేలకు కోహ్లీ రెస్ట్ అడిగాడని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ సహా కొందరు బోర్డు పెద్దలు మీడియాకు చెప్పారు. కానీ, తాను బ్రేక్ కోరలేదని విరాట్ కుండబద్దలు కొట్టాడు. దీంతో, గంగూలీ సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. మొత్తంగా కెప్టెన్సీ మార్పు ఇంత రచ్చగా మారడానికి కారణం ఇరు వర్గాల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే.
విరాట్ కోహ్లీని ప్రస్తుతం కెప్టెన్సీ వివాదాన్ని పక్కనపెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెట్టాలను సూచించాడు. దక్షిణాఫ్రికా టూర్ సమయంలో ఒకరిపై మరోకరు బహిరంగంగా వెలేత్తి చూపించుకోవడం తగదని, అది కోహ్లీకైనా, గంగూలీకైనా ఇంకెవరికైనా సరే మంచి పరిణామం కాదని కపిల్‌దేవ్ హెచ్చరించాడు.
మరోవైపు, దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమిండియా అక్కడికి బయలు దేరింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టెస్టు మ్యాచ్‌లతోపాటు, మూడు వన్డేలు కూడా ఆడనుంది. అయితే భారత జట్టు బయలు దేరే ముందే ఆటగాళ్లందరికీ మూడేసి సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగటివ్ వచ్చాకే విమానం ఎక్కించారు.
దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాక భారత ఆటగాళ్లు అక్కడ ఒక రోజు క్వారంటైన్లో ఉండనున్నారు. అక్కడ కూడా మూడేసి సార్లు భారత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వచ్చినవారికే మ్యాచ్ ఆడడానికి అవకాశం లభిస్తుంది. వారే ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. అయితే, ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.