విజేతగా నిలిచిన జట్టుపై కాసుల వర్షం కురవడం ఖాయం. ఐపీఎల్ లో చాంపియన్ గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ రూపంలో లభించనుంది. అయితే ఈ మొత్తం కూడా ఫ్రాంచైజీ ఖాతాలోకి చేరనుంది. ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు కూడా భారీగానే ప్రైజ్ మనీ లభించనుంది. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 13 కోట్లు లభిస్తాయి.