ఐపీఎల్ నిర్విఘ్నంగా జరగడానికి ఈ వేదికల్లో పనిచేసిన పిచ్ క్యూరేటర్స్, గ్రౌండ్స్ మెన్ లు ఎంతోగానో కష్టపడ్డారు. ఐపీఎల్ పూర్తయ్యాక వీరికి బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. ఆరు వేదికల్లో పనిచేసిన క్యూరేటర్లకు, గ్రౌండ్స్ మెన్ లకు కలిపి మొత్తంగా రూ. 1.25 కోట్లను ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. (PC : TWITTER)
అయితే నజరానా విషయంలో బీసీసీఐ పక్షపాతం ప్రదర్శించినట్లు క్రికెట్ అభిమానులు కొందరు వాదిస్తున్నారు. కేవలం రెండేసి మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలకు రూ. 12.5 లక్షల చొప్పున ఇచ్చి.. 15 మ్యాచ్ లు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన 4 స్టేడియాలకు కేవలం రూ. 25 లక్షల చొప్పున మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. (PC: TWITTER)