టీమిండియా మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న కోసం సిఫార్సు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అశ్విన్, మిథాలీ రాజ్‌ల కు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక, మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1999 జూన్ 26న మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా 38 ఏళ్ల మిథాలీనే ఉన్నారు.
ఇక టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు ఎంతో సేవ చేశాడు. మూడు ఫార్మాట్లలో వికెట్లు తీసి భారత్ విజయాల్లో పాలుపంచుకున్నాడు. అశ్విన్ 79 టెస్టుల్లో 24.6 సగటుతో 413 వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఏడుసార్లు 10 వికెట్ల ప్రదర్శన ఉంది. 111 వన్డేలో 150, 46 టీ20లో 52 వికెట్లు పడగొట్టాడు.