BCCI PRESIDENT SOURAV GANGULY SOME INTERESTING COMENTS ON VIRAT KOHLIS DECISION TO QUIT T20 CAPTAINCY SRD
Sourav Ganguly: " విరాట్ కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంతో నేను షాక్ అయ్యాను ".. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sourav Ganguly: ఇక, ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ను బీసీసీఐనే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియాతో సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూఏఈ వేదికగా ప్రతిష్టాత్మక టీ-20 వరల్డ్ కప్ 2021 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, అసలు సిసలు సమరానికి పెద్ద జట్లన్నీ రెడీ అయ్యాయ్. ఇక, ఆదివారం అక్టోబర్ 24 క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
2/ 8
ఇక, ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ను బీసీసీఐనే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియాతో సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
3/ 8
ఈ మెగా టోర్నీ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీ20 ఫార్మాట్ కి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. బలవంతంగా కోహ్లీని ఆ కెప్టెన్సీ నుంచి తప్పించారనే వాదనలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విషయంలో సౌరవ్ గంగూలీ మౌనం వీడాడు.
4/ 8
ఇది తన సొంత నిర్ణయమని, బీసీసీఐ ఎలాంటి ఒత్తిడి చేయలేదని గంగూలీ చెప్పాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలనుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని విని తాను ఆశ్చర్యపోయానని గంగూలీ తెలిపారు. అయితే కోహ్లీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అర్థమైందని తెలిపాడు.
5/ 8
భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం అంత సులభం కాదని.. గతంలో ఉన్న కెప్టెన్లు తనతో సహా అందరూ ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పాడు.
6/ 8
అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు… ఈ పొట్టి ఫార్మెట్లో ఒక బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని చెప్పాడు.
7/ 8
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ, టీ 20 ల్లో కెప్టెన్‌గా తన చివరి టీ20 ప్రపంచ కప్ 2021లో భారతదేశానికి ట్రోఫీ అందించాలని ఆరాటపడుతున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం అక్టోబర్ 24న జగరనున్న మ్యాచుతో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
8/ 8
అయితే భారత జట్టుకు మాత్రమే కాదు ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు కోహ్లీ.