ఇప్పటికే 29 మ్యాచ్లు పూర్తయిన ఐపీఎల్ 2021లో మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది. దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్లో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు.