డిసెంబర్లో గంగూలీ కరోనా బారిన పడడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో గంగూలీకి స్వల్ప లక్షణాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో గంగూలీకి "మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్" థెరపీని నిర్వహించారు. అనంతరం ఇంటికి తరలించి హోంక్వారంటైన్లో చికిత్స అందిస్తున్నారు.
ఇక, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) కరోనా బారిన పడ్డాడు. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్వెల్ చికిత్స తీసుకుంటున్నాడు.