ఐపీఎల్ 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్న బోర్డు.. రెండు కొత్త జట్లకు లీగ్‌లో స్థానం కల్పించాలని భావిస్తోంది. ఇక ఐపీఎల్ 2021లో 10 జట్లను ఆడించేందుకు బోర్డు తమ కార్యచరణను షూరూ చేసింది. ముందుగా దేశవాళీ క్రికెట్‌ను రీస్టార్ట్ చేయాలని భావిస్తోంది. అందులోనూ ముస్తాక్ అలీ టీ20 లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. (IMAGE CREDIT : TWITTER)
కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన దేశవాళీ క్రికెట్ పోటీలను పునఃప్రారంభించడానికి బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్ హబ్‌లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్ ద్వారా తెలిపారు. (IMAGE CREDIT : TWITTER)
‘సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ 2020-21 డొమెస్టిక్ సీజన్‌ను ప్రారంభించడానికి బీసీసీఐ ప్రణాళికలు రచించింది. స్టేట్ అసోసియేషన్ల నుంచి అందిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. జనవరి 2వ తేదీ నాటికి టోర్నీలో పాల్గొనే జట్లన్నీ తమకు నిర్దేశించిన బయో బబుల్ హబ్‌లకు చేరుకోవాలి. జనవరి 10, ఆదివారం జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. జనవరి 31వ తేదీన జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది ఈ టోర్నీ గ్రూప్ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అసోసియేషన్లు ఏర్పాట్లు చేసుకోవాలి' అని జై షా సూచనప్రాయంగా తెలిపారు. (IMAGE CREDIT : TWITTER)
ఐపీఎల్ జట్ల సంఖ్యను 10కి పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో బోర్డు ముస్తాక్ అలీ టోర్నీనిర్వహణకు మొగ్గు చూపుతోంది. బోర్డు చర్యలను చూస్తుంటే ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా వేలం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక ముస్తాక్ అలీ ముగిసిన వెంటనే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే రంజీ ట్రోఫీ మొదలవ్వడం మరింత ఆలస్యం కానుంది. ఐపీఎల్, దేశవాళీ టోర్నీ షెడ్యూల్‌పై డిసెంబర్ 24 న జరిగే బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా కొత్త జట్టు ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే పుణె, లక్నో వేదికలగా మరో జట్టు వచ్చే ఛాన్స్ ఉంది. (IMAGE CREDIT : TWITTER)