బీసీసీఐ (BCCI).. ప్రపంచ క్రికెట్లోని శక్తివంతమైన బోర్డు. ఈ భూమ్మీద ఏ క్రికెట్ బోర్డుకు లేనన్ని ఆర్థిక వనరులు బీసీసీఐ సొంతం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. క్రికెట్‌ను మతంలా భావించే గడ్డ మీద ఆటగాళ్లకు కొరత లేదు. ఇక, క్రికెట్ లో బీసీసీఐని ఎదురించే దమ్ము ఐసీసీ కూడా లేదన్నది నమ్మలేని వాస్తవం. దాదాపు ఐసీసీకి వచ్చే నిధులన్నీ 90 శాతం మన క్రికెట్ బోర్డు నుంచే వస్తాయి.
ఇప్పటికే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణపై ఇటు బీసీసీఐ, అటు ఐసీసీ మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్)తో కూడా బీసీసీఐకి సమస్య తలెత్తింది. వచ్చే ఏడాది క్రికెట్‌కు సంబంధించి రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఒకటి ఐసీసీ వన్డే వరల్డ్ కప్. దీనికి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
గతంలో 2016లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో బీసీసీఐకి రావాల్సిన వాటిలో, పన్నుగా చెల్లించిన రూ.190 కోట్లను తగ్గించి ఇచ్చింది ఐసీసీ. నిజానికి, ICC పన్ను బిల్లును 21.84 శాతానికి అంటే రూ. 116 మిలియన్ల డాలర్లకు పెంచడం ఇదే మొదటిసారి. ఈ ధరను భారత రూపాయిలలో చూస్తే, దాదాపు రూ. 900 కోట్లు అవుతుంది.
అయితే బీసీసీఐకి, భారత ప్రభుత్వానికి మధ్య పన్నుల వివాదం ఎప్పటికి పరిష్కారమవుతుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది. అయితే ఇవి భారత్‌కు మంచి సంకేతాలు కావు. వివాదాస్పద సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐసీసీ బీసీసీఐకి కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో పన్నుల విషయంలో ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంటే కానీ, ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుందా.. లేదా అనేది తేలదు.