Rishabh Pant: కష్టాల్లో ఉన్న పంత్ కు బీసీసీఐ గుడ్ న్యూస్..పూర్తి వివరాలివే..
Rishabh Pant: కష్టాల్లో ఉన్న పంత్ కు బీసీసీఐ గుడ్ న్యూస్..పూర్తి వివరాలివే..
ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కష్టాల్లో ఉన్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో BCCI మరో కీలక నిర్ణయం తీసుకుంది.

2/ 8
తీవ్ర గాయాలతో బాధపడుతున్న రిషబ్ పంత్ కోలుకోడానికి సుమారు ఏడాది పట్టొచ్చు. ఈ క్రమంలో పంత్ పరిస్థితిని అర్ధం చేసుకున్న బీసీసీఐ మానవతా దృక్పధంతో కీలక నిర్ణయం తీసుకుంది.
3/ 8
రిషబ్ పంత్ క్రికెట్ ఆడకున్నా కూడా అతనికి చెల్లించాల్సిన మొత్తం జీతాన్ని యథావిధిగా చెల్లించనున్నట్టు బీసీసీఐ పేర్కొంది. పంత్ గాయపడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
4/ 8
రిషబ్ పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం కేటగిరి-ఏలో ఉన్నాడు. ఈ కాంట్రాక్టు ప్రకారం పంత్ కు ప్రతి ఏటా బీసీసీఐ రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ కొన్ని నెలలు క్రికెట్ కు దూరం అయినా కూడా మొత్తం జీతాన్ని ఇవ్వనుంది.
5/ 8
ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పంత్ కు IPL కాంట్రాక్టు ప్రకారం రూ.16కోట్లు ఇవ్వాలి. కానీ తీవ్ర గాయాలతో బాధపడుతున్న పంత్ ఐపీఎల్ 2023 దూరం కానున్నట్టు తెలుస్తుంది.
6/ 8
దీనితో ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడకపోయినా కూడా పంత్ కు కాంట్రాక్టు ప్రకారం మొత్తం డబ్బును చెల్లించాలని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ దిగ్గజాలు, సహచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు.
7/ 8
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. పంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
8/ 8
తదుపరి వైద్య చికిత్స కోసం.. ఆయన్ను ఇటీవల డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబై (Mumbai)కి షిప్ట్ చేశారు. పంత్ (Pant Health) పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.