ఐపీఎల్ 2022 కోసం మెగా వేలాన్ని బీసీసీఐ జనవరిలో నిర్వహించనున్నది. 15 సీజన్ కోసం రిటెన్షన్ పాలసీని కూడా ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటికే ఉన్న పాత జట్లు నవంబర్ 30 మధ్యాహ్నం 12.00 గంటల లోపు ఏయే ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకున్నారో తెలపాల్సి ఉన్నది. ప్రస్తుతం పర్స్ వాల్యూ రూ. 90 కోట్లుగా ఉన్నది. ఒక కొత్త జట్లు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు ఆక్షన్‌కు ముందే ముగ్గురిని ఎంచుకునే అవకాశం ఉన్నది. ఇందులో ఇద్దరు ఇండియన్స్, ఒక ఫారిన్ ప్లేయర్ కంటే ఎక్కువ ఉండకూడదు. (PC: IPL)
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సారి వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. అయితే విదేశీ ప్లేయర్ కోటాలో సునిల్ నరైన్ లేదా ఆండ్రీ రస్సెల్‌ను జట్టు అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నది. పాట్ కమిన్స్‌తో చర్చించిన తర్వాత అతడిని కూడా రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తున్నది. (PC: IPL)
కేఎల్ రాహుల్ ఈ సారి పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆ ఫ్రాంచైజీ మయాంక్ అగర్వాల్, రవి బిష్ణోయ్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ హీరో షారుక్ ఖాన్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే అసలు ఎవరినీ రిటైన్ చేసుకోకుండా పూర్తిగా కొత్త జట్టుతో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. (PC: IPL)