MS Dhoni : ’అందరి లాగే ధోని కూడా.. అతడేం ప్రత్యేకం కాదు..‘ షాకింగ్ కామెంట్స్ చేసిన బీసీసీఐ అధికారి
MS Dhoni : ’అందరి లాగే ధోని కూడా.. అతడేం ప్రత్యేకం కాదు..‘ షాకింగ్ కామెంట్స్ చేసిన బీసీసీఐ అధికారి
MS Dhoni : ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అయితే ఐసీసీ టోర్నమెంట్ లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్ ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా (South Africa) వేదికగా సౌతాఫ్రికా టి20 లీగ్ వచ్చే ఏడాది నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
2/ 7
ఇది పేరుకే దక్షిణాఫ్రికా లీగ్ కానీ.. ఇందులో పాల్గొనే ఆరు జట్లను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోని ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్నాయి. వీటిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు కూడా ఉన్నాయి.
3/ 7
కేప్‌టౌన్ ఫ్రాంఛైజీని ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్, డర్బన్ను లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రిటోరియాను ఢిల్లీ క్యాపిటల్స్, పర్ల్‌ను రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకున్నాయి.
4/ 7
ఈ క్రమంలో చెన్నై యాజమాన్యం సీఎస్కే కెప్టెన్, భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని తమ మెంటార్ నియమించిందన్న వార్తలు గుప్పుమన్నాయి.దాంతో సౌతాఫ్రికా టి20 లీగ్ లో భారత ప్లేయర్లు ఆడతారేమో అని అంతా అనుకున్నారు.
5/ 7
అయితే దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. విదేశీ లీగ్ లో బీసీసీఐ తో సంబంధం ఉన్న భారత ప్లేయర్లు ఆడేందుకు వీలు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
6/ 7
ధోని రిటైర్ అయ్యాడు కాబట్టి.. అతడికి బీసీసీఐతో సంబంధం ఏంటని అనుకోవచ్చు. కానీ, బీసీసీఐ పర్యవేక్షణలో నడిచే ఐపీఎల్ లో ధోని ఇంకా కొనసాగుతున్నాడు. దాంతో ధోని విదేశీ లీగ్ లో ఆడే అవకాశం లేదు.
7/ 7
‘అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగేంత వరకు ఏ ఒక్క భారత క్రికెటర్.. దేశవాళీ ఆటగాళ్లు సైతం ఇతర లీగ్‌లలో ఆడకూడదనేది సుస్పష్టం. ఒకవేళ ఎవరైనా రానున్న లీగ్‌లలో ఆడాలని కోరుకుంటే బీసీసీఐతో సంబంధాలు అన్నీ తెంచుకున్న తర్వాతే అతడికి ఆ అవకాశం ఉంటుంది’ సదరు అధికారి పేర్కొన్నాడు.