BCCI : మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. రోహిత్, రాహుల్ ద్రవిడ్ పరిస్థితి ఏంటో మరీ!
BCCI : మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. రోహిత్, రాహుల్ ద్రవిడ్ పరిస్థితి ఏంటో మరీ!
BCCI : ఈ క్రమంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని ఉన్న పళంగా రద్దు చేసి.. కొత్త కమిటీ కోసం ఆహ్వానాలను స్వీకరించింది. సెలెక్షన్ కమిటీ కోసం టీమిండియా మాజీ క్రికెటర్లు దరఖాస్తులు చేసుకున్నారు కూడా.
బీసీసీఐ (BCCI) న్యూ బాస్ రోజర్ బిన్నీ (Roger Binny) ప్రస్తుత టీమిండియా (Team India) ప్రదర్శనమై గుర్రుగా ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ (Asia Cup), టి20 ప్రపంచకప్ (T20 World Cup)లలో భారత్ చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది.
2/ 8
ఈ క్రమంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని ఉన్న పళంగా రద్దు చేసి.. కొత్త కమిటీ కోసం ఆహ్వానాలను స్వీకరించింది. సెలెక్షన్ కమిటీ కోసం టీమిండియా మాజీ క్రికెటర్లు దరఖాస్తులు చేసుకున్నారు కూడా.
3/ 8
ఇక తాజాగా డిసెంబర్ 21న బీసీసీఐ కార్యవర్గం సమావేశం కానుంది. వర్చువల్ పద్దతిన జరిగే ఈ సమావేశంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ అధ్యక్షత వహించనున్నాడు. ఈ క్రమంలో ఈ సమావేశంపై క్రికెట్ సర్కిల్ లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
4/ 8
సమావేశంలో కోచ్, కెప్టెన్సీ మార్పులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో సెలెక్షన్ కమిటీని కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
5/ 8
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలను టీమిండియాలో కూడా పాటించాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు ఇద్దరు సారథులు ఉన్నారు. టెస్టులకు బెన్ స్టోక్స్, వన్డే, టి20లకు జాస్ బట్లర్ కెప్టెన్ గా ఉన్నారు.
6/ 8
ఇక టెస్టులకు ఒక కోచ్ ను.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు మరో కోచ్ ను ఇంగ్లండ్ కొనసాగిస్తుంది. ఇది ఆ జట్టుకు సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుంది. భారత్ కూడా ఈ విధానాన్ని అవలంభించాలా వద్దా అనే విషయంపై మీటింగ్ లో బీసీసీఐ చర్చించనుంది.
7/ 8
టీమిండియా టి20 కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా కు అప్పగించి.. అదే విధంగా టెస్టులకు ఒక కోచ్ ను.. పరిమిత ఓవర్లకు మరో కోచ్ ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రోహిత్ వన్డే, టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహిరించే అవకాశం ఉంది.
8/ 8
ఇక ద్రవిడ్ కూడా మూడు ఫార్మాట్లలో కోచ్ గా ఉండే అవకాశం లేదు. వన్డే, టి20లకు మాత్రమే ద్రవిడ్ కోచ్ గా ఉండే అవకాశం ఉంది. టెస్టులకు మరో కొత్త వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉంది.