BCCI అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మొత్తం 26 మంది ఆటగాళ్లను చేర్చింది బీసీసీఐ. BCCI ఆటగాళ్లను A+, A, B మరియు C 4 గ్రేడ్ల కింద ఉంచింది. A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా A+ గ్రేడ్‌లో ఉన్నారు.
రాహుల్‌తో పాటు పుజారా, శ్రేయస్, సిరాజ్, సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ బిలో ఉన్నారు. ఉమేశ్, శిఖర్, శార్దూల్, ఇషాన్, హుడా, చాహల్, కుల్దీప్, సుందర్, శాంసన్, అర్ష్‌దీప్, భరత్ సిలో ఉన్నారు. ఏ-గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏటా రూ.5 కోట్లు ఇస్తుంది. B గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు రూ. 3 కోట్లు మరియు C గ్రేడ్‌లో చేర్చబడిన ఆటగాళ్లకు వార్షిక రిటైనర్‌షిప్ ఫీజుగా రూ. 1 కోటి లభిస్తుంది.