Home » photogallery » sports » BADMINTON STAR SAINA NEHWAL PARTICIPATES IN KAPIL SHARMA SHOW ALONG WITH HIS HUBBY PARUPALLI KASHYAP CR

కపిల్‌శర్మ షోలో సందడి చేసిన సైనా నెహ్వాల్... భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి...

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అనారోగ్యం కారణంగా లభించిన విరామాన్ని ఆస్వాదిస్తోంది. భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి తిరుగుతూ ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ వుమెన్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సైనా నెహ్వాల్‌, ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌తో కలిసి ‘కపిల్ శర్మ షో’లో ప్రత్యక్షం అయ్యింది. పారుపల్లి కశ్యప్‌తో మ్యారేజ్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన సైనా నెహ్వాల్... ఆటతీరులోనూ, డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ తేడా చూపిస్తోంది.. క్లీవేజ్ షో, స్లీవ్ లెస్ టాప్స్‌‌లతో తనలోని అల్ట్రా గ్లామరస్ యాంగిల్ చూపిస్తూ... ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసేసిన సైనా నెహ్వాల్... ‘కపిల్ శర్మ షో’లో మాత్రం పద్ధతైన దుస్తుల్లో హాజరై, అందర్నీ ఆశ్చర్యపర్చింది.