విరాట్ కోహ్లి (Virat Kohli) మరోసారి లయను అందుకోవడంలో విఫలమయ్యాడు. జూలై 1న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఏకైక టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ నిరాశపర్చాడు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 33 పరుగులకే ఔటయ్యాడు. గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడు. IPL 2022లో కూడా కోహ్లీ ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. (AFP)
మరోవైపు.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 2022లో ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 10 మ్యాచ్‌ల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 83 సగటుతో 913 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. 196 పరుగులు అతని అత్యధిక స్కోరు. వన్డే క్రికెట్లో వరుసగా 3 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. అతను ఈ నెలలోనే ఈ రికార్డు సృష్టించాడు. (AFP)
2022 ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే 900 కంటే ఎక్కువ పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన లిటన్ దాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 15 మ్యాచ్‌లు.. 20 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 996 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. యూఏఈకి చెందిన వి అరవింద్ 945 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. (AFP)