ఐపీఎల్ 2021 తుది దశకు చేరుకున్నది. ఇవాళ జరుగనున్న ఎలిమినేటర్, అక్టోబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తున్నది. ఐపీఎల్ 2021 సీజన్లో బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే.. సీనియర్ల కంటే అన్క్యాప్డ్ ప్లేయర్లే ఎక్కువగా రాణించారు. ఎవరూ ఊహించని బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో వారికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అవేశ్ ఖాన్‌కు పిలుపు వచ్చింది. (PC: IPL)
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అవేశ్ ఖాన్ 7.50 ఎకానమీ.. 18.60 సగటుతో 23 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా అవేశ్ ఖాన్ రికార్డులకు ఎక్కాడు. అత్యంత వేగవంతమైన బంతులు వేయడమే కాకుండా వికెట్లు కూడా తీసుకుంటుండటంతో అతడి సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ సెలెక్టర్లు భావించారు. (PC: IPL)