డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియా క్రికెట్ చిచ్చర పిడుగు. క్రీజులో నిలదొక్కుకుంటే ఏ బౌలర్ కైనా చుక్కలు కనబడాల్సిందే. ఐపీఎల్ పుణ్యమా అని మనోడికి భారత్ లో కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక, మనోడి ఫేస్ మార్ఫింగ్ వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, వార్నర్ కరోనా కష్టాలన్నిటిని ధాటి ఇటీవలే ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే, తన భర్త పర్సనల్ సీక్రెట్స్ ను రివీల్ చేసింది భార్య క్యాండిస్ వార్నర్. (Image Credit : Instagram)
కరోనాతో అల్లాడుతున్న భారత్లో చిక్కిపోయిన తన భర్త పట్ల వార్నర్ సతీమణి క్యాండిస్, పిల్లలు ఆందోళనకు గురయ్యారు. క్యాలెండర్లో రోజులు లెక్కపెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ ఆసీస్ ఓపెనర్ ఇంటికి చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా క్యాండిస్ ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. (Image Credit : Instagram)
ఇక వార్నర్-క్యాండీస్లది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకుంటున్న ఈ జంట.. ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగినా ఒకరికొకరు తెలియదంట. ఈ విషయాన్నే క్యాండిసే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. (Image Credit : Instagram)
"మా వివాహానికి రెండేళ్ల ముందు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మేం తొలిసారి కలుసుకున్నాం. అప్పడు నేను ఆస్ట్రేలియాలో ప్రాచుర్యం పొందిన సీటీ2సర్ఫ్ మారథన్ రన్ పూర్తి చేశాను. నా ఫ్రెండ్ పక్కన ఉన్న వార్నర్ చాలా మొరటుగా కనిపించాడు. ఏ మాత్రం స్నేహపూర్వకంగా ఉంటాడనిపించలేదు. మాములుగా హాలో మాత్రమే చెప్పుకున్నాం. అతనో అహంకారి, మొరటు వ్యక్తి అనే భావన నాలో కలిగింది. అయితే అప్పటికే అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది" అని క్యాండిస్ చెప్పుకొచ్చింది. (Image Credit : Instagram)
గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ లైంగీక జీవితంపై కూడా క్యాండిస్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘ది కైల్ అండ్ జాకీ ఓ' షోలో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. "ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్కు ముందు సెక్స్ చేస్తాడా?"అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అతను కావాలనుకుంటే చేస్తాడని, లేకుంటే లేదని తెలిపింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే నిబంధనతో అయితే ఏమి ఉండడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త ఈ విషయంలో చాలా సమర్థుడని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. (Image Credit : Instagram)