పేపర్ పై బలంగా కనిపించిన ఢిల్లీ జట్టు తమ తొలి మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ పై అద్బుత విజయంతో సీజన్ లో బోణీ కొట్టింది. అయితే ఆ తర్వాత అనుకున్న రీతిలో ఆడలేకపోయింది. ఇక ముంబైతోనే జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంత్ చెత్త కెప్టెన్సీ వల్ల ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాన్ని దూరం చేసుకుంది.
‘నేను ఇండియాకు రావడానికి కొద్ది రోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. అనంతరం ఇండియాలో అడుగు పెట్టి ఒక మ్యాచ్ ఆడానో లేదో వెంటనే కోవిడ్ బారిన పడ్డాను. ఆ సమయంలో నేను షాక్ కు గురయ్యా. ఏదైనా నాకు శాపం తగిలిందా? అనే భావనలో ఉండిపోయాను. కోవిడ్ నుంచి నేను త్వరగానే కోలుకున్నా. మళ్లీ ఢిల్లీ జట్టుతో చేరి మంచి ప్రదర్శనలు చేశా‘అని మిచెల్ మార్ష్ పేర్కొన్నాడు. (PC : TWITTER)