టెస్ట్ క్రికెట్ లో నయా రన్ మెషీన్ గా అవతరిస్తున్నాడు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschange). తన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ టెస్టు క్రికెట్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో లబుషేన్ ని ఔట్ చేయడం అంటే కత్తి మీద సామే అని చెప్పుకోవచ్చు. (AP)
ఇక, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో టాప్ ఫామ్‌లో ఉన్న లబుషేన్.. ఈ డేనైట్ టెస్ట్‌లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. (AP)
ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచులో 163 పరుగులు చేసి ఔటయ్యాడు లబుషేన్. ఇది అతనికి హ్యాట్రిక్ సెంచరీ. లబుషేన్ వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 204, 104 నాటౌట్‌గా నిలిచాడు. కెరీర్లో రెండోసారి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు 2019లో.. అతను వరుసగా 3 ఇన్నింగ్స్‌లలో 185, 162 మరియు 143 పరుగులు చేశాడు. (AP)
ఓవరాల్ గా 30 టెస్టులాడి.. 3010 పరుగులు చేశాడు. యావరేజ్ 61.43. ఇక, ఆస్ట్రేలియన్ మాజీ వెటరన్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్టుల్లో దాదాపు 100 సగటును కలిగి ఉన్నాడు. కానీ బ్రాడ్ మాన్ కూడా 3 వరుస ఇన్నింగ్స్‌లలో 2 సార్లు 3 సెంచరీలు సాధించలేకపోయాడు ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కూడా రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. (AP)