David Warner : కోహ్లీ 1021.. వార్నర్ 1043.. 2022లో సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన దిగ్గజ ప్లేయర్స్
David Warner : కోహ్లీ 1021.. వార్నర్ 1043.. 2022లో సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన దిగ్గజ ప్లేయర్స్
David Warner : ఎన్నో సందర్భాల్లో వీరిద్దరు కూడా తమ జట్లను ఒంటి చేత్తో గెలిపించారు. అయితే వీరిద్దరికి కూడా 2022 సంవత్సరం మరుపురానిదిగా మారిందనే చెప్పాలి.
విరాట్ కోహ్లీ (Virat Kohli), డేవిడ్ వార్నర్ (David Warner) క్రికెట్ దిగ్గజాలు అని చెప్పవచ్చు. దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడుతూ తమ దేశాలకు సేవలు అందిస్తున్నారు. వీరిద్దరూ మైదానంలో అడుగుపెడితే ఎంతటి బౌలర్ అయినా సరే కంగారు పడాల్సిందే.
2/ 8
ఎన్నో సందర్భాల్లో వీరిద్దరు కూడా తమ జట్లను ఒంటి చేత్తో గెలిపించారు. అయితే వీరిద్దరికి కూడా 2022 సంవత్సరం మరుపురానిదిగా మారిందనే చెప్పాలి.
3/ 8
కోహ్లీ 2019లో 70వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత మరో అంతర్జాతీయ సెంచరీ చేయడానికి ఏకంగా 1,021 రోజులు తీసుకున్నాడు. ఆఖరికి ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ పై సెంచరీ బాది సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
4/ 8
తాజాగా డేవిడ్ వార్నర్ కూడా ఇదే చేశాడు. వార్నర్ కూడా తన చివరి అంతర్జాతీయ సెంచరీని 2020లో నమోదు చేశాడు. ఆ తర్వాత మరో సెంచరీని అందుకోలేకపోయాడు.
5/ 8
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినా సెంచరీని మాత్రం సాధించలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో మ్యాచ్ ల వన్డే సిరీస్ లో సెంచరీ కరువును తీర్చుకున్నాడు.
6/ 8
ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో వార్నర్ 106 పరుగుల చేశాడు. దాంతో సెంచరీ నిరీక్షణకు తెర దించాడు. 1,043 రోజుల తర్వాత వార్నర్ మరోసారి అంతర్జాతీయ శతకం బాదాడు.
7/ 8
వార్నర్ కు ఇది 19వ వన్డే శతకం కావడం విశేషం. ఓవరాల్ గా 44వది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 152 పరుగులతో సెంచరీ బాదాడు.
8/ 8
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48 ఓవర్లకు 355 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 364 పరుగులుగా అంపైర్లు సవరించారు. ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.