Asia Cup 2022 : ఆరు నూరైనా ఆ ప్లేయర్ టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందే.. లేదంటే చాలా కష్టం..
Asia Cup 2022 : ఆరు నూరైనా ఆ ప్లేయర్ టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందే.. లేదంటే చాలా కష్టం..
Asia Cup 2022 : గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12 దశను దాటలేకపోయింది. అంతేకాకుండా పాకిస్తాన్ చేతిలో ఓడి అవమానకర రీతిలో ఇంటి దారి పట్టింది.
ఈ ఏడాది ఆఖర్లో అంటే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ నెగ్గడం తప్ప మళ్లీ పొట్టి ప్రపంచకప్ లో భారత్ అటువంటి ఘనతను సొంతం చేసుకోలేకపోయింది.
2/ 7
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12 దశను దాటలేకపోయింది. అంతేకాకుండా పాకిస్తాన్ చేతిలో ఓడి అవమానకర రీతిలో ఇంటి దారి పట్టింది.
3/ 7
ఇక ప్రస్తుతం కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టి20 ప్రపంచకప్ కోసం సన్నద్దం అవుతోంది. ఈ క్రమంలో వరుస పెట్టి టి20 సిరీస్ లను ఆడుతుంది.
4/ 7
ఇక తాజాగా భారత టి20 ప్రపంచకప్ జట్టు విషయంలో మాజీ కోచ్ రవిశాస్త్రి ఒక ప్లేయర్ గురించిం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టులో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంటానని పేర్కొన్నాడు.
5/ 7
అంతేకాకుండా తుది జట్టులో అతడికి తప్పకుండా అవకాశం ఇస్తా అన్నాడు. ఎవరు జట్టులో ఉన్నా లేకపోయినా అర్ష్ దీప్ సింగ్ కు మాత్రం తాను ప్లేయింగ్ ఎలెవన్ లో తప్పక చోటిస్తానన్నాడు.
6/ 7
ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై ఆడేటప్పుడు జట్టులో లెఫ్టార్మ్ పేసర్ ఉండటం ఎప్పటికీ మంచిదే అన్నాడు. అంతేకాకుండా అర్ష్ దీప్ వైవిధ్యంతో కూడిన బంతులను వేయడంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని అతడు తప్పక టి20 ప్రపంచకప్ లో ఉండాలంటూ కామెంట్స్ చేశాడు.
7/ 7
విండీస్ తో జరుగుతోన్న టి20 సిరీస్ లో అర్ష్ దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ కలిపి 7 వికెట్లు తీశాడు. ఇక నాలుగో టి20లో అయితే ఏకంగా మూడు వికెట్లు తీశాడు.