ఇక పాక్ తో మ్యాచ్ కు ముందు భారత్ ను నలుగురు పాకిస్తాన్ ప్లేయర్లు టెన్షన్ పెడుతున్నారు. ఇందులో మొదటగా ఉన్నది మాత్రం మొహమ్మద్ రిజ్వాన్. ఆసియా కప్ లో రిజ్వాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత్ పై 43, హాంకాంగ్ పై 78 నాటౌట్ తో అదరగొట్టాడు. ఇతడి ఫామ్ ను బట్టి చూస్తే భారత్ పై మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడేలా కనిపిస్తున్నాడు. (PC : TWITTER)
మోకాలి గాయంతో షాహీన్ అఫ్రిది ఆసియా కప్ నుంచి వైదొలగడంతో పాకిస్తాన్ బౌలింగ్ బలహీనంగా మారింది అని అంతా అనుకున్నారు. అయితే 19 ఏళ్ల నసీం షా బౌలింగ్ చూశాక ఎవరూ ఆ మాట ఎత్తడానికి సాహసం చేయలేకపోతున్నారు. గత రెండు మ్యాచ్ ల్లోనూ నసీం షా ఆకట్టుకున్నాడు. భారత్ పై 2 వికెట్లు తీసిన అతడు హాంకాంగ్ పై 2 వికెట్లు తీశాడు. ఆరంభంలో వికెట్లు తీయడం నసీం షా ప్రత్యేకత. ఇతడిని భారత ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. (PC : TWITTER)
వీటితో పాటు టాస్ కూడా భారత్ ను టెన్షన్ పెడుతుంది. హాంకాంగ్ పై జరిగిన మ్యాచ్ లను మినహాయిస్తే ఆసియా కప్ లో జరిగిన మిగతా మ్యాచ్ ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. దాంతో ఈ మ్యాచ్ ఫలితంపై కూడా టాస్ ప్రభావం చూపనుంది. భారత్ ఒక మ్యాచ్ లో టాస్ గెలిచి మరో దాంట్లో ఓడింది. డ్యూ ఫ్యాక్టర్ ఉండటంతో టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (PC : TWITTER)
వీటితో పాటు బాబర్ ఆజమ్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆసియా కప్ లో ఫామ్ లో లేకపోయినా ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్.. బ్యాటర్లు ఇఫ్తికర్ అహ్మద్, దిల్ ఖుష్దిల్ షా కూడా మంచి టచ్ లో ఉన్నారు. పాక్ పై విజయం సాధించాలంటే రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ రాణించాల్సి ఉంది. (PC : TWITTER)