Asia Cup 2022 : కార్తీక్ వద్దు.. పాక్ తో మ్యాచ్ కు తుది జట్టు ఎలా ఉండాలో చెప్పేసిన టీమిండియా మాజీ లెజెండ్
Asia Cup 2022 : కార్తీక్ వద్దు.. పాక్ తో మ్యాచ్ కు తుది జట్టు ఎలా ఉండాలో చెప్పేసిన టీమిండియా మాజీ లెజెండ్
Asia Cup 2022 : అయితే ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్ టోర్నీలలో ఈ రెండు జట్లు తలపడుతు వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్ 2022లో భాగంగా ఈ రెండు జట్లు మరోసారి సై అంటే సై అనబోతున్నాయి.
మరో రెండు రోజుల్లో దాయాది దేశాలు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్లు ఆసియా కప్ (Asia Cup) వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు.
2/ 7
అయితే ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్ టోర్నీలలో ఈ రెండు జట్లు తలపడుతు వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్ 2022లో భాగంగా ఈ రెండు జట్లు మరోసారి సై అంటే సై అనబోతున్నాయి.
3/ 7
చివరి సారిగా ఈ రెండు జట్లు గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో తలపడగా.. అందులో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్ ను మట్టికరిపించింది. దానికి ప్రతీకారం తీర్చుకునాలనే పట్టుదలతో భారత్ ఈ పోరుకు సిద్ధమవుతుంది.
4/ 7
ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ కు భారత జట్టు కూర్పుపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తో మ్యాచ్ కు భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇలా అయితే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తన అభిప్రాచం వ్యక్తం చేశాడు.
5/ 7
తన ప్లేయింగ్ ఎలెవన్ లో ఏకంగా ఇద్దరు స్పిన్నర్లను ఇద్దరు పేసర్లను ఇద్దరు ఆల్ రౌండర్లకు చోటు ఇచ్చాడు. వికెట్ కీపర్ తో కలుపుకుని 5 మంది బ్యాటర్లను తీసుకున్నాడు.
6/ 7
బ్యాటర్లుగా రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్ (వికెట్ కీపర్ కూడా) లను తీసుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్, జడేజాలను.. స్పిన్నర్లుగా అశ్విన్, చహల్ లను పేసర్లుగా భువనేశ్వర్, అర్ష్ దీప్ లకు చోటు ఇచ్చాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ లను బెంచ్ కే పరిమితం చేశాడు.