Rohit Sharma : కెప్టెన్ గా వచ్చింది నిన్నే.. కానీ అప్పుడే కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. ఏంటంటే?
Rohit Sharma : కెప్టెన్ గా వచ్చింది నిన్నే.. కానీ అప్పుడే కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. ఏంటంటే?
Rohit Sharma : ఇక సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అతడు ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. అదే సమయంలో కోహ్లీ వారసుడిగా టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మ అందుకున్నాడు.
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ (T20 World Cup) అనంతరం అటు టి20, ఇటు వన్డే కెప్టెన్సీలను విరాట్ కోహ్లీ (Virat Kohli) కోల్పోయిన సంగతి తెలిసిందే. టి20 కెప్టెన్సీని స్వచ్ఛందంగా కోహ్లీనే వదులుకున్నప్పటికీ వన్డేల నుంచి మాత్రమ బీసీసీఐ తప్పించింది.
2/ 6
ఇక సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అతడు ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. అదే సమయంలో కోహ్లీ వారసుడిగా టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మ అందుకున్నాడు.
3/ 6
తాజాగా రోహిత్ శర్మ కోహ్లీ పేరిట ఉన్న కెప్టెన్సీ రికార్డును సమం చేసేందుకు కేవలం గెలుపు దూరంలోనే ఉన్నాడు. టి20ల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు భారత్ కు 35 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో నాయకత్వం వహించాడు. ఇందులో 29 గెలిస్తే.. మరో 6 మ్యాచ్ ల్లో ఓడింది.
4/ 6
అదే సమయంలో కోహ్లీ 50 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహిరించాడు. ఇందులో భారత్ 30 మ్యాచ్ ల్లో గెలువగా.. మరో 16 మ్యాచ్ ల్లో ఓడింది. రెండు మ్యాచ్ లు టైగా ముగియగా.. మరో రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి.
5/ 6
పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ ను గెలిపిస్తే రోహిత్ శర్మ 30 విజయాలతో కోహ్లీ కెప్టెన్సీ రికార్డును సమం చేస్తాడు. ఇక 31న హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ తో టి20 ఫార్మాట్ లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్ గా నిలుస్తాడు.
6/ 6
ప్రస్తుతం ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని ముందున్నాడు. కోహ్లీ 72 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ 41 మ్యాచ్ ల్లో నెగ్గింది. మరో 28 మ్యాచ్ ల్లో ఓడింది. 2 మ్యాచ్ లు రద్దు కాగా.. ఒక మ్యాచ్ టై అయ్యింది