Asia Cup 2022 : ఏంటి రోహిత్.. అలా అనేశావ్.! టి20 ప్రపంచకప్ తర్వాత కూడా ఇలానే అంటావా ఏంటి?
Asia Cup 2022 : ఏంటి రోహిత్.. అలా అనేశావ్.! టి20 ప్రపంచకప్ తర్వాత కూడా ఇలానే అంటావా ఏంటి?
Rohit Sharma : అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యింది. అంతేకాకుండా కీలక సమయాల్లో క్యాచ్ లను కూడా జారవిడిచి మ్యాచ్ లను ఓడిపోయింది. దాంతో అభిమానులు టీమిండియానే ఏకిపారేస్తున్నారు.
ఆసియా కప్ (Asia cup) 2022లో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శనతో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. పేపర్ పై బలంగా ఉన్న భారత్ (India) మైదానంలో మాత్రం చేతులెత్తేసింది.
2/ 9
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యింది. అంతేకాకుండా కీలక సమయాల్లో క్యాచ్ లను కూడా జారవిడిచి మ్యాచ్ లను ఓడిపోయింది. దాంతో అభిమానులు టీమిండియానే ఏకిపారేస్తున్నారు.
3/ 9
అయితే రోహిత్ శర్మ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఆసియా కప్ లో ప్రయోగాల బాట పట్టినట్లు పేర్కొన్నాడు.
4/ 9
టి20 ప్రపంచకప్ ముందు తాము ప్రయోగాలు చేస్తూ వచ్చినట్లు దానిలో భాగంగానే ఆసియా కప్ లో కూడా ప్రయోగం చేసినట్లు అతడు పేర్కొన్నాడు. ఆసియా కప్ కంటే ముందు కూడా తాము ఆడిన సిరీస్ ల్లో నలుగురు సీమర్లు ఇద్దరు స్పిన్నర్లతో ఆడినట్లు తెలిపాడు.
5/ 9
ఇక ఆసియా కప్ లో మాత్రం ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు మరొక ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ తో ఆడినట్లు తెలిపాడు. తాము ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు.
6/ 9
అయితే ఈ ప్రయోగాన్ని కేవలం సీమర్లపైనే ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఓపెనర్ గా రాహుల్ స్థానంలో గిల్ ను.. పంత్ స్థానంలో సంజూ సామ్సన్ ను కూడా ప్రయోగించి ఉండాల్సింది కదా అని అభిమానులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
7/ 9
ఇంతటితో ఊరుకోక ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టి20 సిరీస్ ల్లో కూడా తాము ప్రయోగాల బాట పడతానని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికే జట్టు 95 శాతం రెడీగా ఉన్నప్పుడు ఈ ప్రయోగాలు ఎందుకో అర్థం కావడం లేదు.
8/ 9
కనీసం ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ నుంచి అయినా టి20 ప్రపంచకప్ లో బరిలోకి దిగే ప్లేయింగ్ ఎలెవన్ తో ఆడిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది టీమిండియా ఒక స్థిరమైన జట్టుతో ఆడింది లేదు. సిరీస్ సిరీస్ కు భారీ మార్పులను చూస్తూ వస్తుంది. దాంతో జట్టులో సమన్వయం కనిపించడం లేదు.
9/ 9
ఇదే తీరున టి20 ప్రపంచకప్ లో కూడా ఆడితే.. ఈసారి కూడా సూపర్ 12తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన గ్రూప్ లో పాకిస్తాన్, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లు ఉన్నాయి.