గతంలో వన్డే కెప్టెన్సీపై కూడా కోహ్లీ బీసీసీఐని విమర్శించాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించే విషయం ముందుగా చెప్పలేదని పేర్కొన్నాడు. అయితే దీనిపై అప్పట్లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. కెప్టెన్సీ విషయం కోహ్లీకి ముందే చెప్పినట్లు.. అంతేకాకుండా పరిమిత ఓవర్లకు ఒకరే కెప్టెన్ గా ఉంటే మంచిదనే ఉద్దేశంతో వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించినట్లు వివరణ కూడా ఇచ్చాడు.